Satakarni

ఇప్పుడు ఏ ఇద్దరు  తెలుగు వాళ్ళు  కనిపించినా  శాతకర్ణి గురించే చర్చ.  ఇంతకీ  ఎవరు  ఈ శాతకర్ణి? శాతకర్ణి  గురించి  తెలుసుకోవాలంటే క్రీస్తు పూర్వం  చరిత్ర లోకి  వెళ్లవలసిందే!

శాతవాహన  అనే  బ్రాహ్మణ  వంశం రాజ్యాధికారం  చేపట్టి  వీరత్వం తో తెలుగు నేల  తో పాటు కర్ణాటక, తమిళ,మహారాష్ట్ర  మొదలుకుని  మధ్యప్రదేశ్, బీహార్, గుజరాత్  దాదాపుగా  భారత దేశాన్ని పరిపాలించిన గొప్ప చక్రవర్తులు. ఆ వంశం లోని రాజులే  శాతకర్ణి అనే పేరుతో  ప్రసిద్ధి  పొందారు .  ఒకటి నుంచి మూడో శతాబ్దం లో వీరి పరిపాలన సాగింది, దాదాపుగా 300 వందల ఏళ్ళ  నుంచి 450 ఏళ్ళు వీళ్ళ  పరిపాలన కొనసాగింది. 18 నుంచి 30 మంది శాతవాహన చక్రవర్తులు  పరిపాలన కొనసాగించినట్టు  చరిత్ర చెప్తుంది.

చారిత్రక  ఆధారాలు  ఎక్కువగా  లేని  కారణంగా శాతవాహన  పాలనా రాజుల సంఖ్యా పై కొన్ని  అనుమానాలు  ఉన్నాయ్. కొంతమంది  చరిత్రకారులు వీరి  పరిపాలన  300 ఏళ్ళు మాత్రమే సాగిందని శాతవాహన వంశం లో 18 రాజులు  పరిపాలన సాగించారని  చెపితే  మరికొందరు 30 రాజులు 450 ఏళ్ళు ఏలుబడి చేసారని వ్రాసారు . అయితే మొదటినుంచి తెలుగువారికి చరిత్ర  రాసుకునే  అలవాటు లేకపోవడమో , నిర్లక్షమో కానీ అదే  ఇప్పటికీ కొనసాగుతోంది . మన (తెలుగు) చరిత్ర కారులు శాతవాహనుల చరిత్ర  గురించి  తెలుసుకునే ప్రయత్నం చేయలేదు  కానీ శాతవాహనుల చరిత్ర  మహారాష్ట్ర, మధ్యప్రదేశ్  ప్రభుత్వాలు  తమ గజెట్ లో  చేర్చుకున్నాయి . ఇందులో భాగంగానే  ఆ చరిత్ర  కారులు  చేసిన పరిశోధనలు శాతవాహనులు  తెలుగు వారు  కాదు  అనే  వాదన చేసాయి . పరిశోధనలు  జరిపిన వాళ్ళు  మాత్రం  శాతవాహనుల  చరిత్ర  పురాణాలలో  కూడా  ప్రస్తావించారని  తెలిపారు.

శాతవాహన రాజుల ఫై  పరిశోధనలు  చేసిన ఆర్ . జి . భండార్కర్ , డి . ఆర్ . భండార్కర్ లు  మాత్రం  పురాణాలూ పురాణాల  ప్రకారం  చూసిన  శాతవాహనులు  తెలుగు  వారే  అని చెప్పారు. శాతవాహన  వంశం  శ్రీముఖ  అనే  రాజు  తో మొదలు అయిందని పూలమావి మూడు  తో అంతరించిందని చరిత్రకారులు  చెప్తున్నారు. మొత్తం  మీద ఇంత మంది  రాజులో  కొంతమందే  రాజ్యవిస్తరణలో కీలక పాత్ర అని చరిత్ర  మనకి రుజువు  చేస్తుంది . వారిలో  శాతకర్ణి 1, పూర్ణోత్సంగా , శాతకర్ణి 2, గౌతమిపుత్ర శాతకర్ణి , వాసిస్టి పుత్ర  పులుమావి ,శివశ్రీ శాతకర్ణి , శివస్కంధ శాతకర్ణి, గౌతమీపుత్ర  యజ్ఞ శ్రీ శాతకర్ణి  పరిపాలనలో  రాజ్య విస్తరణ  జరిగింది .

అయితే  శాతవాహనులు  వేసిన  శాసనాలు , నాణాలు  చాలావరకు ప్రస్తుత  భారత దేశంలో బీహార్, మధ్యప్రదేశ్ లలో లభ్యం అయ్యాయి .  మొత్తం  మీద శాతవాహనులు  అఖండ  భారత దేశ స్థాపన వైపు  అడుగులు  వేయడం  తెలుగువారిగా  మనం సంతోషపడదాం , కానీ ఇంతటి  మన ఘన  చరిత్రని రాసుకోలేకపోవడంపై , మన అసమర్ధతని  ఆసరాగా  చేసుకుని  పక్క  రాష్ట్రాల  వాళ్ళు మన వాళ్ళని సొంతం చేసుకోవాలని  చూడ్డం  ఫై సిగ్గుపడాలి . మహారాష్ట్ర  ప్రభుత్వపు  గజెట్  చదివిన తరువాత  నా  అభిప్రాయం  ఇది .

One thought on “Satakarni

  1. విశ్వనాధ సత్యన్నారాయణ గారు రాసిన ” శాతవాహన( సింహవాహనుడు) ” కి ఈ శాలివాహనులకి సంబంధం వుందా?

    Like

Please post your comments below!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s