నాకు నచ్చిన పుస్తకాలు

తెలుగు కథాభిమానులు “మా పసలపూడి కథలు” తప్పక చదివే ఉంటారు. వంశీ  గారు స్వాతి వార పత్రికకి రాసిన కథలు కథా ప్రపంచంలోనే ఒక విప్లవం అని చెప్పొచ్చు. కేవలం “మా పసలపూడి కథలు” చదవడానికే  స్వాతి వారపత్రికని  కొనేవారు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. గోదావరి అంటేనే అందం. ఇక దాని చుట్టూ ఉన్న గ్రామాల అందాల గురించి చెప్పాలంటే మాటలు చాలవు. అలాంటి ఒక అందమైన గ్రామమే పసలపూడి. వంశీ గారీ  ఊరు.

vamsi-kathalu

పసలపూడి లో జరిగిన ఘటనలను కథలుగా రాశారు. కథలలోని పాత్రలు, సన్నివేశాలు, కథను వర్ణించిన తీరూ చదువుతుంటే మనమే పసలపూడిలో ఉండి ప్రత్యేక్షంగ  చూసినట్టు అనుభూతి చెందుతాం. 77 కథలతో సంకలనం చేసిన ఈ పుస్తకం చదువుతున్నంత సేపూ మనసు గోదావరి పరిసరాలలో విహరిస్తున్నటు ఉంటుంది. ఈ కధలకి వంశీ  వాడిన భాష అచ్చంగా గోదావరి జిల్లా వాడుక భాష. వంశీ వర్ణించిన గోదావరి గట్టు, దానిపై మర్రి చెట్టు, దానిని అనుకుని ఉన్న కాఫీ హోటలు, గోదావరిలో ప్యాసెంజర్ పడవలు, వెన్నెల రాత్రులు. ఇలాంటివి ఇంచుమించు ప్రతి కథలోనూ  మనకు కనిపిస్తాయి. ప్రత్యేకంగా కథలగురించి చెప్పాలంటే “శ్రీ శ్రీ శ్రీ పూసపాటి రాజావారు”, “కోరి రావుగారి బస్సు కండక్టర్”, “భద్రాచలం యాత్ర వాళ్ళ అక్క కథ”, “పాముల  నాగేశ్వరరావు”, “మున్సబుగారు గుఱ్ఱంబండి”, “అచ్చుతానిది అమృత హస్తం”, ఇలా చెప్పుకుంటూ పొతే ప్రతీ కధా అద్భుతమే.

కథల గురించి చెప్పగానే  కథ అయిపోదు, ఆ కధలకి వేసిన బొమ్మల కోసం చెప్పకపోతే తప్పు చేసినట్టే. కథలోని  వర్ణనకి తగ్గట్టుగా బాపుగారు వేసిన బొమ్మలు మహా అద్భుతం. అసలు ఆ కథలకి   బాపు గారి బొమ్మలే హైలైట్. దింట్లో మరో మాటలేదు. రేండు మేధసులు కలిస్తే ఎంత అద్భుతం జరుగుతూందో “మా పసలపూడి కథలు” చెప్తాయి.

Please post your comments below!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s