గ్రామాలు, నాడు… నేడు…

==కలలకొచ్చె కండ్లనిండా
ఊరికాడి చెట్టు నీడ…
సల్ల గాలి గట్టు కాడ…==

~   వాకిట్ల అలికిన బర్లపేడ…
దొడ్ల కట్టిన ఆవు దూడ…
పాల పిట్టలు పాట పాడ…
మేక పిల్లలు ఆటలాడ…  ~

== కళ్ళు తెరిసి ఇయ్యాల సూడు దేవుడా ఇది ఎంత తేడ…
మారిపాయె వూరు వాడ…
కానరావు పిట్టల జాడా…==

~ కూలుతున్న బావులు…
బక్కచిక్కిన ఆవులు…
దలార్ల చేతుల పావులు…
దినాము రైతుల సావులు… ~

== పైస కోసం కౌలు రైతు దిక్కులన్నీ దేవులాడ
పుస్తెలమ్మి వాడు తెచ్చే అప్పు సావుకారు కాడ… ==

~సల్లినాడు పురుగు మందు లెక్కలేక ఆడ ఈడ…
రైతన్న మీద అలిగి దేవుడు చుక్క అయిన రాల్చడా… ~

==చినుకు రాక…
ఆశ పోక…
కాపు కాసే చివరి దాక…==

~ మిత్తి మీద మిత్తి గట్టే
ఇంట్లకెల్లి యెల్లగొట్టె…
ఊపిర ఆడక గొంతు పట్టె…
సావుకారా  వేటగాడా…~

~ పంట పాయె…
బతుకు మొత్తం అయ్యో రామ ఆగమాయే
రైతులిందరు రాలుతుంటే…
మనకు చీమ అయినా కుట్టదాయే  ~

sugarcane-223437_960_720

==నిద్రలెసి నేటి తరము…
మధనపడితే నిరంతరము…
నిర్వహించి  కనీస ధర్మము…
కారా వారే ఊరి వరము… ==

~కాదు కాదు  సాగు భయము
ఇస్తే మనము నిండు అభయము
చేతనయిన సాయము
వెలిగిపోవు వ్యవసాయము ~

~పచ్చ చీరలో ముద్దు గుమ్మలు
పల్లెలేరా పట్టు కొమ్మలు…
అన్నము పెట్టు అన్నపూర్ణలు…
దేశానికే అసలు సొమ్ములు… ~

 

Paadi-Panta Today: A First-Hand Perspective

These are some musings and thoughts about what keeps me restless, and what my experiences have been, from a little journey of an organisation that I work with to make our villages a better place. I have put my perspectives in black and white as to what muddles my peace.

I shall speak of what I have witnessed happening at large – things we are all quite aware of – and then how these phenomena have affected my village, a hamlet about 100 km from Hyderabad. Continue reading