తెలుగు కథాభిమానులు “మా పసలపూడి కథలు” తప్పక చదివే ఉంటారు. వంశీ గారు స్వాతి వార పత్రికకి రాసిన కథలు కథా ప్రపంచంలోనే ఒక విప్లవం అని చెప్పొచ్చు. కేవలం “మా పసలపూడి కథలు” చదవడానికే స్వాతి వారపత్రికని కొనేవారు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. గోదావరి అంటేనే అందం. ఇక దాని చుట్టూ ఉన్న గ్రామాల అందాల గురించి చెప్పాలంటే మాటలు చాలవు. అలాంటి ఒక అందమైన గ్రామమే పసలపూడి. వంశీ గారీ ఊరు.
Author: merusomayajulaphanikumar
ఉత్తరం
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ పదో ప్లాట్‌ఫామ్‌పై ఆగిన గౌతమి ఎక్స్‌ప్రెస్ నుంచి దిగిన నేను క్యాబ్ కోసం బైటకి రాగానే నా చూపు అటువైపు పడింది.
ఏదో గోల, ప్లాట్‌ఫామ్‌పై ఉన్న కొంత మంది గుంపుగా చేరారు. ఏదో జరిగింది, దగ్గరకి వెళ్లి చూద్దాం అని అక్కడికి వెళ్లాను. ఆ దృశ్యం చూడగానే ఒకరకమైన ”షాక్” – 28 సంవత్సరాల యువతి స్పృహతప్పి పడి ఉంది. చుట్టూ మూగినవారు చూస్తున్నారేగాని ఎవరూ దగ్గరకు వెళ్లి ఆస్పత్రికి చేర్చే పని చేయడంలేదు.
యువతి బోర్లాపడి ఉండడంతో నేను వెళ్లి పక్కకు తిప్పి ఎత్తే ప్రయత్నంలో ఆమె మెహం కనపడింది. షాక్ – పడి ఉన్నది వాసంతి, నాకు పరిచయం ఉన్న యువతే. కాస్త చుట్టూ ఉన్నవారి సహాయంతో వాసంతిని క్యాబ్‌లో ఎక్కించుకుని నేనుండే అమీర్‌పేటలోని ఆస్పత్రికి తీసుకెళ్లాను. ఫస్ట్‌ఎయిడ్ చేసిన డాక్టర్లు బైటకి వచ్చారు.
“ఏమైంది డాక్టర్, ఏమిటి ఆమె పరిస్థితి?” అని అడిగాను.
“చూడండి మిస్టర్, మీ పేరు?”
“నా పేరు శ్రీకాంత్, నేను ఓ ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్ని.”
“మిస్టర్ శ్రీకాంత్, ఆవిడ మీకు ఏమౌతారు?”
“షీ ఈజ్ మై ఫ్రెండ్ డాక్టర్.”
“చూడండి, ఆవిడ ఆత్మహత్య ప్రయత్నం చేశారు.”
నాకు మరోసారి షాక్, తేరుకోక ముందే డాక్టర్ చెప్పడం మొదలుపెట్టాడు. Continue reading
జల్లికట్టు కలిసికట్టు
పోరాట పటిమ అంటే ఏమిటో తమిళులని చూసి నేర్చుకోవలసిందే ఎవరైనా. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ వాళ్ళు. “పట్టు పట్టరాదు పట్టివిడువరాదు ” అన్నది నానుడి. ఇది రాసింది తెలుగువారైన, తమిళ తంబిల విషయంలో ఇది సరిగ్గా సరిపోతుంది. ఇంతకీ ఇదంతా ఎందుకంటారా, తమిళ సాంప్రదాయ క్రీడ జల్లికట్టు విషయంలో తమిళులు చేస్తున్న పోరాటం చూస్తుంటే భళే అనిపిస్తుంది. స్వయంగా ఉన్నత న్యాయస్థానం జల్లికట్టు ఫై నిషేధం విధించినా , దాన్ని రద్దు చేయాలంటూ చేస్తున్న పోరాటంలో దినసరి కూలీ నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి దాకా ఏకతాటిపైకి వచ్చి పోరాటం చేస్తున్న తీరు చూస్తుంటే అది కేవలం తమిళులకు మాత్రమే సాధ్యం అన్నది అర్ధం అవుతుంది. తమిళలందరు ఒక్కటి కావడం కేవలం జల్లికట్టు విషయంలోనే అనుకుంటే మనం పప్పులో కలువేసినట్లే .
Satakarni
ఇప్పుడు ఏ ఇద్దరు తెలుగు వాళ్ళు కనిపించినా శాతకర్ణి గురించే చర్చ. ఇంతకీ ఎవరు ఈ శాతకర్ణి? శాతకర్ణి గురించి తెలుసుకోవాలంటే క్రీస్తు పూర్వం చరిత్ర లోకి వెళ్లవలసిందే!
శాతవాహన అనే బ్రాహ్మణ వంశం రాజ్యాధికారం చేపట్టి వీరత్వం తో తెలుగు నేల తో పాటు కర్ణాటక, తమిళ,మహారాష్ట్ర మొదలుకుని మధ్యప్రదేశ్, బీహార్, గుజరాత్ దాదాపుగా భారత దేశాన్ని పరిపాలించిన గొప్ప చక్రవర్తులు. ఆ వంశం లోని రాజులే శాతకర్ణి అనే పేరుతో ప్రసిద్ధి పొందారు . ఒకటి నుంచి మూడో శతాబ్దం లో వీరి పరిపాలన సాగింది, దాదాపుగా 300 వందల ఏళ్ళ నుంచి 450 ఏళ్ళు వీళ్ళ పరిపాలన కొనసాగింది. 18 నుంచి 30 మంది శాతవాహన చక్రవర్తులు పరిపాలన కొనసాగించినట్టు చరిత్ర చెప్తుంది. Continue reading
Parikini – ఒక పరిచయం
తనికెళ్ళ భరణి చాలా మందికి నటుడిగానో , దర్శకుడిగానో మాత్రమే తెలుసు. కానీ అయన నాటక రచయిత, కథ మాటల రచయిత కూడా అని కొంత మందికే తెలుసు. దర్శకుడు వంశీ తీసిన లేడీస్ టైలర్, శ్రీ కానక మహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్ సినిమాలకి తనికెళ్ళ మాటలు, స్క్రీన్‌ప్లే అందించారు. అంతే కాదు అయన ఒక కవి కూడా.
అయన రాసిన పరికిణి పుస్తకం చాలా రోజుల క్రితం చదివా అందులోని కొన్ని కవితలు చదివినప్పుడు కంట నీరు రాక మానదు. Continue reading