Parikini – ఒక పరిచయం

తనికెళ్ళ భరణి చాలా మందికి నటుడిగానో , దర్శకుడిగానో మాత్రమే తెలుసు. కానీ అయన నాటక రచయిత, కథ మాటల రచయిత కూడా అని కొంత మందికే తెలుసు. దర్శకుడు వంశీ తీసిన లేడీస్ టైలర్, శ్రీ కానక మహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్ సినిమాలకి తనికెళ్ళ మాటలు, స్క్రీన్ప్లే అందించారు. అంతే కాదు అయన ఒక కవి కూడా.

అయన రాసిన పరికిణి పుస్తకం చాలా రోజుల క్రితం చదివా అందులోని కొన్ని కవితలు చదివినప్పుడు కంట నీరు రాక మానదు.

మధ్యతరగతి నటరాజు అనే కవిత లో తనికెళ్ళ తండ్రి గారు పడిన కష్టాలను శివుడితో పోల్చిన  తీరు,

తనకిష్టమైన ఆవకాయను దేవతా స్త్రీలతో పెట్టించిన కారం కారం గా కల,

తల్లితండ్రుల కోరికలని కడుపునా పుట్టిన పిల్లల అవసరాలు తీరచలేని తండ్రి వ్యధ, థర్టీ ఫస్ట్ నైట్ లో ఒకసారైనా మొగుడిని అనిపించుకుందాం అన్న తీరు,

పరికిణి చీర అవుతుంది, వాల్జడ కొప్పుగా మారుతుంది , లోలాకులు దుద్దులుగా మారతాయి అన్న కన్యా కుమారి,

కాపీలే కొట్టామో అత్తేసరు మార్కులతో యూనివర్సిటీ నుంచి నడ్డి మీద తన్ని బైటకి తోసేశారు అన్న గ్రాడ్యుయేట్…

ఇలా ఒకటేమిటి తనికెళ్ళ రాసిన మొత్తం కవితలు ఒకదానిని మించిన ఒకటి. ఎన్నో యేళ్ళ క్రితం చదివిన పుస్తకమైనా ఇంకా గుర్తు ఉన్నాయ్ అంటే మధ్య తరగతి ఇళ్లలో జరిగే వాటినే కవితలు గా రాసారు భరణి గారు.

కుదిరితే ఒక సారి మీరు కూడా చదవండి.

Please post your comments below!

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s